Murder | ఆవుపాలు పిండుతున్న వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు.. స్థానికుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..Video
Murder | ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలువదని అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు ఆయనను కాల్చిచంపి పారిపోయారు.
Murder : ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలువదని అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు ఆయనను కాల్చిచంపి పారిపోయారు. ఈ ఊహించిన పరిణామానికి స్థానికులు షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాజధాని పట్నాలోని దనపూర్ ఏరియాలో ఝలన్ రాయ్ అనే 44 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా అతడు ఇంటి ఆవరణలో తన ఆవుకు పాలు పిండుతున్నాడు. అదే సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుమీద వచ్చి అతడిని కాల్చిచంపారు. దుండగులు ఎవరో తెలియదు. ఎందుకు చంపారో తెలియదు.
ఈ హఠాత్పరిణామానికి స్థానికులు ఖంగుతిన్నారు. దుండగులు ఇళ్లలో ఉన్న వాళ్లను కాల్చిచంపుతున్నా రక్షణ కరువైందని ఆందోళనకు దిగారు. ఝులన్ రాయ్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. దాంతో దనపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Danapur
- Jhulan Rai
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

