Watch | ఇంటిముందు కూర్చున్న వృద్ధుడిపై పడిన కంకర ట్రక్కు.. వృద్ధుడు మృతి.. Video
Watch | మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పడం కష్టం అంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని గ్వాలియర్ (Gwalior) లో ఓ వృద్ధుడికి మృత్యువు ఊహించని రీతిలో ముంచుకొచ్చింది.
Watch : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పడం కష్టం అంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని గ్వాలియర్ (Gwalior) లో ఓ వృద్ధుడికి మృత్యువు ఊహించని రీతిలో ముంచుకొచ్చింది. వృద్ధుడు తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. ఆ వీధిలోకి కంకరలోడుతో వచ్చిన ట్రక్కు అతనిపై పడింది. దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 90 ఏళ్ల వృద్ధుడు గిరిరాజ్ శర్మ తన మనవడు సతీష్‌తో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎండపొడ కోసం వృద్ధుడు ఇంటి బయట ఉన్న అరుగుపైన కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న ఓ కంకర ట్రక్కు అదుపుతప్పి ఒక్కసారిగా అతడిపై బోల్తా పడింది.
దాంతో గిరిరాజ్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజుల క్రితం ఆ ప్రాంతంలో నీటి పైపులైను వేయడంవల్ల గుంతలు పడ్డాయి. వాటిలో ట్రక్కు టైరు దిగబడడంతో వాహనం బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని, కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నామని అన్నారు.
𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…
In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

