Super Blue Moon | ఆకాశంలో అరుదైన దృశ్యం.. దర్శనమిచ్చిన సూపర్ బ్లూ మూన్.. Video
Super Blue Moon | ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆగస్టు నెలలో రెండు పున్నములు రావడంతో రెండో పున్నమి రోజు పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూమూన్ అంటారు.
హైదరాబాద్: ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆగస్టు నెలలో రెండు పున్నములు రావడంతో రెండో పున్నమి రోజు పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూమూన్ అంటారు. ఆగస్టులో తొలి పౌర్ణమి 1వ తేదీన వచ్చింది. ఇవాళ రెండో పౌర్ణమి. కాబట్టి ఇవాళ పెద్దగా కనిపించే చంద్రుడే బ్లూ మూన్. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడంతో సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను అధికంగా ప్రసరింపజేస్తాడు.
బుధవారం చీకటి పడిన తర్వాత దేశవ్యాప్తంగా సూపర్ బ్లూమూన్ ఆవిష్కృతమైంది. ఈ బ్లూమూన్ ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీహార్ రాజధాని పట్నాలో సూపర్ బ్లూ మూన్‌కు సంబంధించిన దృశ్యాలను ఓ జాతీయ మీడియా సంస్థ కెమెరాలో బంధించింది. అనంతరం ఆ వీడియోను ఎక్స్ (X) లో పోస్టు చేసింది.
#WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1
— ANI (@ANI) August 30, 2023
బ్లూ మూన్ అంటే..?
ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తుంటారు. అరుదుగా ఒకే నెలలో రెండు పున్నములు ఏర్పడుతుంటాయని నాసా తెలిపింది. కాగా, చివరిసారిగా బ్లూ మూన్ 2009 డిసెంబర్లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో కూడా బ్లూ మూన్ ఏర్పడబోతున్నది. అయితే, బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కనిపించడు. పరిమాణంలో పెద్దగా కనిపిస్తాడు. కాగా, ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని అందరూ తిలకించాలని, మళ్లీ తొమ్మిది సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

