Building collapsed : గుజరాత్లో భారీ భవన ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని సచిన్ ఏరియాలో ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి.
రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ నాలుగంతస్తుల భవనంలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఒక మహిళను శిథిలాల నుంచి బయటికి తీశామని, హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
#WATCH | Gujarat: A Four-floor building collapsed in Sachin area of Surat. Many people feared trapped. Police and fire department team at the spot. Rescue operations underway. pic.twitter.com/FIJJUGzbEQ
— ANI (@ANI) July 6, 2024