న్యూఢిల్లీ, మే 16: మూడేండ్లలో 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఈ పోటీ ప్రపంచంలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగానే సంస్థలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని, 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నామని వెల్లడించింది.
వొడాఫోన్ సంస్థలో దాదాపు లక్ష మంది పనిచేస్తున్నారు. 11 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించడం సంస్థ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయంగా పలువురు పేర్కొంటున్నారు.