VK Sasikala | కల్తీ మద్యం మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : శశికళ
VK Sasikala : తమిళనాడు (Tamil Nadu)లోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
VK Sasikala : తమిళనాడు (Tamil Nadu)లోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అస్వస్థతకు గురైన మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు.
వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్ దవాఖానకు తరలించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తమిళనాడు మాజీ సీఎంకు అత్యంత సన్నిహితురాలు వీకే శశికళ ఆరోపించారు. కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని వారం రోజుల్లోగా అరెస్ట్ చేయాలని సంబంధిత అధికారులను బదిలీలతో సరిపెట్టకుండా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టకుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని శశికళ అన్నారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన జరిగే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

