న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఏఐ) మానవ జీవితాల్లోకి వేగంగా చొచ్చుకువస్తూ సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తోంది. లేటెస్ట్గా మనిషి ప్రమేయం లేకుండా మెషీన్ ఆహారాన్ని తయారుచేస్తున్న వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ది ఫైజెన్ ఈ వైరల్ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో మెషీన్‌కు ఓ ప్యాన్ అమర్చి ఉంటుంది..ఈ ప్యాన్ మంటపై వేగంగా కదులుతూ కూరగాయలను సమంగా కుక్ చేయడం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ అంతా నేర్చుకోవడానికి చెఫ్‌కు సహజంగా కొన్ని నెలలు పడుతుంది. అలాంటిది ఈ మెషీన్ వాయువేగంతో వంటకం సిద్ధం చేయడం నెటిజన్లను అబ్బురపరుస్తోంది.
Crazy machine chef. 😂pic.twitter.com/tBxdWekV9Z
— Figen (@TheFigen_) June 26, 2023
ఈ వీడియోకు క్రేజీ మెషీన్ చెఫ్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 56 లక్షల మందికి పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్టయ్యారు. ఏఐ సాయంతో ఈ మెషీన్ ఎలా పనిచేస్తోందనేది కొందరు వివరించగా, ఫుడ్ ఇండస్ట్రీలోనూ ఏఐతో కొలువుల కోత తప్పదని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
Read More :