Viral video | ఆఫీసుకు వెళ్లనంటూ తల్లి మారాం..రెండేండ్ల చిన్నారి ఏం చేశాడంటే..!
వారం ఆరంభం అంటే సోమవారం ఉదయం చాలా మంది ఆఫీసులకు వెళ్లేందుకు బద్దకిస్తుంటారు. ఏదో సాకు చెప్పి ఆఫీసులకు డుమ్మా కొట్టే వారూ (Viral video) ఉంటారు.
న్యూఢిల్లీ : వారం ఆరంభం అంటే సోమవారం ఉదయం చాలా మంది ఆఫీసులకు వెళ్లేందుకు బద్దకిస్తుంటారు. ఏదో సాకు చెప్పి ఆఫీసులకు డుమ్మా కొట్టే వారూ (Viral video) ఉంటారు. అలాంటి వారిలో స్ఫూర్తి నింపి ఉత్తేజం కలిగించే ఓ మోటివేషనల్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో తల్లి ఆఫీసుకు వెళ్లనని చెబుతుంటే వెళ్లక తప్పదని రెండేండ్ల చిన్నారి ఆమెకు నచ్చచెప్పడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
లిటిల్ యువనీష్ భరద్వాజ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 70 లక్షల మంది పైగా వీక్షంచారు. ఈ వీడియోలో తల్లి ఈరోజు ఆఫీసుకు తాను వెళ్లడం లేదని చెప్పగా ఆఫీసుకు వెళ్లాల్సిందే అని నచ్చచెప్పడం కనిపిస్తుంది.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. జీవితంలో నాకు ఇలాంటి ఎమోషనల్ సపోర్ట్ అవసరం అని ఓ యూజర్ కామెంట్ చేయగా తల్లిని ఆఫీసుకు వెళ్లేలా ఆ బాబు ఎంత బాగా ప్రిపేర చేశాడో అని మరికొందరు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More
Virat Kohli | ఇదో అద్భుతం.. భూతద్దం సాయంతో కోహ్లీ రూపం.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- motivation
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

