హైదరాబాద్: మోటారు సైకిల్‌ను మామూలుగానే మనం మోయలేం. అలాంటిది బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు టాప్‌పైకి ఎక్కాడో వ్యక్తి.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నది. గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు దానిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి.
ఇక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియోలో ఉన్న వ్యక్తి ఓ బైక్‌ను తన తలపై పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చన పైకి ఎక్కేశాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైకి చేరుకున్నాడు. అనంతరం దానిని టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై దించేశాడు.
They are really super human 👏🔥❤️ pic.twitter.com/kNruhcRzE1
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 25, 2022
అంత బరువును నెత్తిన పెట్టుకుని బస్సెక్కిన ఆ వ్యక్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. అతడే నిజమైన సూపర్ హీరో అని, బాహుబలి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.