Viral video : బెంగళూరు పరిధిలోని ఒక మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఒక స్టూడెంట్‌కు ఏకంగా క్లాస్‌రూంలోనే లవ్ ప్రపోజ్ చేశాడు ప్రొఫెసర్. దీంతో అతడిని క్యాంపస్‌లోనే ఆ అమ్మాయి చెప్పుతో కొట్టింది. తోటి విద్యార్థులు కూడా ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరు సరిహద్దు, తుంకూరు పరిధిలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ క్లాస్ రూంలో అందరు విద్యార్థుల మధ్య ఒక స్టూడెంట్‌కు లవ్ ప్రపోజ్ చేశాడు.
తనపై విద్యార్థులు చూపించే ప్రేమను దాచుకోలేకపోతున్నానని, మీ బ్యాచ్‌లోని ఒక ముఖ్యమైన విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేయబోతున్నా అంటూ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా తనను ఇష్టపడుతోందని, అందుకే తను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందరిముందే క్లాస్ రూంలో ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. దీంతో షాకైన ఆ అమ్మాయి తాను ఎప్పుడు లవ్ ప్రపోజ్ చేశానో చెప్పాలని ప్రొఫెసర్‌ను అడిగింది. ఆ అమ్మాయి తనకు లవ్ ప్రపోజ్ చేసిందని, దీనిపై ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పాడు. అయితే, ఆ ఫుటేజ్, ఆధారాలు చూపించాలని విద్యార్థిని అడగడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన గురించి విన్న విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
A serious incident has been reported from Siddhartha Medical College in T. Beguru village of Nelamangala taluk, where a lecturer allegedly proposed to a female student inside a classroom, leading to a tense situation and subsequent violence on campus.
The accused lecturer has… pic.twitter.com/kdhfs5gWuz
— Hate Detector 🔍 (@HateDetectors) March 26, 2026
కొద్దిసేపటి తర్వాత ఆ ప్రొఫెసర్ క్యాంపస్ నుంచి వెళ్లిపోతుండగా, అతడి కారు వద్ద విద్యార్థులు అడ్డుకుని దాడి చేశారు. అంతేకాదు.. ఆ అమ్మాయి అతడిని చెప్పుతో కొట్టింది. మరోవైపు ప్రొఫెసర్‌పై క్యాంపస్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిని ఉద్యోగంలోంచి తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.