Massive avalanche | జమ్ముకశ్మీర్‌లో భారీ హిమపాతం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. Video viral
Massive avalanche | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని సోన్మార్గ్ (Sonmarg) లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఈ హిమపాతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Massive avalanche : ఇవాళ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని సోన్మార్గ్ (Sonmarg) లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఈ హిమపాతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ ఎత్తున మంచు ఎగిసి దూసుకొస్తున్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. హిమపాతం సందర్భంగా అక్కడే ఉన్న పలువురు పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు.
🇮🇳📹 A massive avalanche strikes the Indian village of Sarbal in Jammu and Kashmir. 🥶🥶#Avalanche #India #JammuAndKashmir #Disaster #weather #Kashmir #Jammu #Sarbal #BreakingNews #incredible #Indian #Pakistan pic.twitter.com/bKymfbzrsS
— Ali Shunnaq (@schunnaq) March 5, 2025
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామం వద్ద కూడా భారీ హిమపాతం సంభవించింది. దాంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 55 మంది మంచు కింద చిక్కుకుపోయారు. వారిలో 47 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. మిగతా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
హిమపాతం అంటే ఏమిటి..?
ప్రతి ఏడాది శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడుతుంటాయి. ఈ చరియలు 5 సెకన్ల కాలంలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుతాయి. ఈ సందర్భంగా సుమారు 2.3 లక్షల ఘనపు మీటర్ల మంచు జారిపడుతుంది. అంటే 20 ఫుట్‌బాల్ గ్రౌండ్లను మూడు మీటర్ల మందంతో కప్పేంత మంచు అన్నమాట. దీనినే అవలాంచ్ అని అంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

