Viral news : ఓ యువ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ (Girl friend) తో ఏకాంతంగా గడపాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. ఆమెను సూట్‌కేసులో కూర్చోబెట్టుకుని ఎవరికీ తెలియకుండా బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి సూట్‌కేసు తెరువడంతో విషయం బయటపడింది. హర్యానా రాష్ట్రం (Haryana state) లోని సోనిపట్ (Sonipat) లో ఉన్న ఓపీ జిందాల్ యూనివర్సిటీ (OP Jindal University) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీకి చెందిన విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ గదికి తీసుకొచ్చి ఏకాంతంగా గడపాలని భావించాడు. అందుకోసం ఓ భారీ లగేజ్ సూట్‌కేసులో ఆమెను కూర్చోబెట్టుకుని వర్సిటీలోకి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సూట్‌కేసులో ఏముందని ప్రశ్నించగా అతను తన దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయని చెప్పాడు. కానీ అతని తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో సూట్‌కేసును తెరిచి చూపించమని అడిగారు.
కానీ సదరు విద్యార్థి సూట్‌కేసును తెరిచేందుకు నిరాకరించాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వర్సిటీ ఉన్నతాధికారులు సూట్‌కేసును తెరిచి చూడగా అందులో నుంచి ఓ యువతి బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అదే యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
A boy tried sneaking his girlfriend into a boy’s hostel in a suitcase.
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg
— Squint Neon (@TheSquind) April 12, 2025
అయితే సూట్‌కేసులో ఉన్న అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థా, లేక బయట నుంచి వచ్చిన యువతా అనే విషయం ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ఈ మధ్య సూట్ కేసులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయని చమత్కరించారు.