లక్నో: రెండు గ్రూపుల మధ్య హింసాత్మకంగా ఘర్షణ జరిగింది. (Violent Clash) ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. కర్రలతో కొట్టుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. రెండు గ్రూపుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై మరొకరు చేతులతో పంచ్‌లు ఇచ్చుకున్నారు. కొందరు కర్రలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది.
కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘర్షణకు దిగిన రెండు గ్రూపుల వారిని కంట్రోల్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. చివరకు పరిస్థితిని అదుపుచేశారు. కొట్టుకున్న రెండు గ్రూపులకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందించారు. ఇరు వర్గాల ఫిర్యాదుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उक्त प्रकरण के सम्बन्ध में थाना फेस-2 पुलिस द्वारा मारपीट करने वाले व्यक्तियों को पुलिस हिरासत लिया गया है, घायलों का मेडिकल कराया गया है। पुलिस द्वारा तहरीर प्राप्त कर अग्रिम विधिक कार्रवाई की जा रही है।
— DCP Central Noida (@DCPCentralNoida) June 10, 2024