న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉన్నది. జులానా నియోజకవర్గంలో రెజ్లర్ వినేశ్ పోగట్(Vinesh Phogat) ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నాలుగు రౌండ్లు ముగిసేవరకు యోగేశ్ ప్రస్తుతం మూడువేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో.. ప్రస్తుతం బీజేపీ 47 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.
#WATCH | Congress candidate from Julana, Vinesh Phogat leaves from a counting centre in Jind, Haryana.
As per official EC trends, she is leading from Julana. #HaryanaElection pic.twitter.com/cagXmHUqUp
— ANI (@ANI) October 8, 2024