Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
Vijay TVK : త్వరలోనే టీవీకే కూడా ఇండియా బ్లాక్ ఆందోళనల్లో చేరుతుందని వీసీకే నేత తోల్ తిరుమవలవన్ శుక్రవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల్లో టీవీకే పాల్గొంటుందని వివరించారు.
Vijay TVK : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కొద్ది రోజులుగా ఇండియా బ్లాక్ పార్టీలు భారీగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో తమిళనాడు, విజయ్ పార్టీ టీవీకే చేరలేదు. సర్‌కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పార్టీ పలు ప్రకటనలు చేసింది.
కానీ.. ప్రతిపక్షాల ఆందోళనలో మాత్రం పాల్గొనలేదు. అయితే, ఈ అంశంపై తమిళనాడులో విజయ్ కూటమికి చెందిన పార్టీ వీసీకే నేత స్పందించారు. త్వరలోనే టీవీకే కూడా ఇండియా బ్లాక్ ఆందోళనల్లో చేరుతుందని వీసీకే నేత తోల్ తిరుమవలవన్ శుక్రవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల్లో టీవీకే పాల్గొంటుందని వివరించారు. జాతీయ స్తాయి నిరసనల్లో టీవీకే పాల్గొనపోయినప్పటికీ.. ఇటీవల తమిళనాడుకు చెందిన ఇండియా బ్లాక్ నిరసనల్లో మాత్రం పాల్గొంది. ‘‘ఇప్పటికే టీవీకే ఇండియ కూటమిలో చేరింది. వారు ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం.
ఇండియా బ్లాక్ తమిళనాడు యూనిట్ చేపట్టిన నిరసనల్లో ఇటీవల పాల్గొన్నారు. త్వరలో జాతీయ స్థాయి నిరసనల్లో కూడా టీవీకే పాల్గొంటుంది’’ అని తోల్ తిరుమవలవన్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే కూటమి అధికారంలో కొనసాగుతోంది. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. అందుకే, కాంగ్రెస్ పార్టీతో సాగుతున్న ఇండియా కూటమిలో టీవీకే చేరింది. త్వరలోనే జాతీయస్థాయిలో ఆందోళనలకు సిద్ధమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- INDIA bloc
- TVK
- VCK
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

