కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా లోకల్ ట్రైన్లో వృద్ధ దంపతుల వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో వృద్ధ దంపతులు బిస్కెట్ పాకెట్‌ను చేతపుచ్చుకుని లోకల్ ట్రైన్లో కూర్చుని మాట్లాడుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. కోల్‌కటర్ ఫ్రేమ్ అనే పేజ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 2 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో వృద్ధ దంపతులు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ వ్యక్తి బిస్కెట్ ప్యాకెట్‌ను ఓపెన్ చేసి భార్యకు అందించడం కనిపించింది. అదే కంపార్ట్మెంట్లో కూర్చుని ఉన్న మరో ప్రయాణీకుడు ఈ వీడియోను రికార్డు చేశాడు.
ప్రేమలో పడటం సులభమే కానీ ప్రేమతో నిలబడటమే ప్రత్యేకమని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఇక కామెంట్స్ సెక్షన్ లవ్, హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. బ్రేకప్‌లు రొటీన్ అయిన ఈ రోజుల్లో అదే వ్యక్తితో ప్రతిరోజూ కలిసిఉండటం అనేది గొప్పవిషయమని పలువురు యూజర్లు వృద్ధ దంపతుల అన్యోన్యతను కొనియాడారు.
Read More :