న్యూఢిల్లీ : ఇమాం రంజాన్ ప్రార్ధనలు చేస్తుండగా పిల్లి ఆయన మీదికొచ్చిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగవైరలవుతోంది. అలాతిఖి అనే ట్విట్టర్యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. 28 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో ఇమాం రంజాన్ ప్రార్ధన చేస్తుండగా ఒక్కసారిగా పిల్లి ఆయన మీదికి ఎక్కింది.
Cat jumps on Imam during qiyam (taraweeh) prayers and he behaves exactly like any imam Insha’Allah would.#Ramadan pic.twitter.com/QHGXSgiZgK
— Alateeqi العتيقي (@BinImad) April 4, 2023
నేల పైనుంచి ఎగిరి ఇమాం భుజంపైకి చేరగా, ఆయన ఏమాత్రం తడుముకోకుండా ప్రార్ధన కొనసాగిస్తూనే పిల్లిని ఆప్యాయంగా నిమరడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.కొద్దిసేపు ఇమాం భుజంపైనే కూర్చున్న పిల్లి ఆపై కిందికి దూకింది.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 5 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోకు ట్విట్టర్ యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. క్యూట్ వీడియో అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇది మా హృదయాలను తాకిందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More