కాంవడ్ యాత్రకు అనుమతించండి: వీహెచ్‌పీ
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది.

లక్నో: ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఈ యాత్రకు అనుమతించాలని, ఈ అంశాన్ని ప్రత్యేకమైనదిగా పరిగణించకూడదని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర జైన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయినా ఈద్-ఉల్-అధాకు కేరళ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని, దీనిని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కంవడ్ యాత్రకు అనుమతించాలని కోరారు.
కరోనా వ్యాప్తి ఆందోళనల దృష్ట్యా కాంవడ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఈ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ మాత్రం యాత్రను నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే మతం, మనోభావాల కంటే జీవించే హక్కు గొప్పదని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీచేసింది. దీంతో శనివారం యాత్రను రద్దు చేస్తూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ యాత్రలో కోట్లాది మంది శివ భక్తులు పాల్గొని గంగా జలాలను సేకరించి, శివలింగాలకు అభిషేకం చేస్తుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

