Vande Bharat Express: వందే భారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే
Vande Bharat Express: వందే భారత్ టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్ల వేగం. కానీ ఆ రైలు యావరేజ్ స్పీడ్ 83 కిలోమీటర్లే. వందేభారత్ స్పీడ్‌పై వేసిన ఆర్టీఐ పిటీషన్ ఆధారంగా ఈ విషయం తెలిసింది.
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైళ్లు సగటున గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. నిజానికి ఈ రైళ్ల టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. కానీ రైల్వే ట్రాకులు సరిగా లేని కారణంగా.. ఆ రైళ్లు కేవలం గంటకు 83 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు ఓ ఆర్టీఐ ఫిర్యాదు ద్వారా తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వందేభారత్ రైళ్ల స్పీడ్ ఏంతో తెలుసుకున్నారు.
2021-22 సీజన్లో ఆ వందేభారత్ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఇక 2022-23 సీజన్లో ఆ రైళ్లు సగటున కేవలం 81.38 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ రైళ్లకు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్నా.. ట్రాక్ కండీషన్స్ దృష్ట్యా ఆ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రీతిలో స్పీడ్ ఫిక్స్ చేశారు. కానీ ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోవడం లేదని తెలుస్తోంది.
ముంబై-షిర్డి మధ్య నడిచే వందేభారత్ రైలు సగటున గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఇదే లోయెస్ట్ యావరేజ్ స్పీడ్. ఇక న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడిచే రైలు మాత్రం అత్యధికంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

