Bengaluru | పుట్టిన రోజు ఒక్కటే.. ఇప్పుడు మరణించిన రోజు కూడా..
ఉత్తరాఖండ్‌లోని హిమాల య పర్వతాల్లోని సహస్త్రతల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లి మరణించిన కర్ణాటకకు చెందిన భార్యాభర్తలకు సంబంధించిన విషయం అందరినీ కలచివేస్తున్నది.
- ట్రెక్కింగ్‌లో మృతి చెందిన దంపతుల విషాదం
Bengaluru | బెంగళూరు: ఉత్తరాఖండ్‌లోని హిమాల య పర్వతాల్లోని సహస్త్రతల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లి మరణించిన కర్ణాటకకు చెందిన భార్యాభర్తలకు సంబంధించిన విషయం అందరినీ కలచివేస్తున్నది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో కర్ణాటక హుబ్బళికి చెందిన భార్యాభర్తలు వినాయక్ ముంగురవాడీ, సుజాత ముంగురవాడీ కూడా ఉన్నారు. వీరిద్దరూ 1994లో హుబ్బళిలోని బీవీబీ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు.
ఇద్దరి పుట్టిన రోజు ఒక్కటే. ఇప్పుడు మరణించిన రోజు కూడా ఒక్కటే కావడం విషాదం. 1996 నుంచి వీరు బెంగళూరులో ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వినాయక్ స్నేహలోక అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 16 ఏండ్లుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో అనేకమందికి సహాయం చేశారు. ప్రతి ఏడాది వినాయక్ ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఈ ఏడాది భార్యతో వెళ్లారు. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోడంతో మం చులో కూరుకుపోయి ఇద్దరూ మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

