Pawandeep Rajan: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇండియన్ ఐడల్ విన్నర్
ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేత పవన్‌దీప్ రాజన్( Pawandeep Rajan )ను ఉత్తరాఖండ్ కళలు, పర్యాటకం, సాంస్కృతికం బ్రాండ్ అంబాసిడర్‌గా బుధవారం నియమించారు. పవన్‌దీప్ తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ఇంగ్ ధామి ఈ ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేత పవన్‌దీప్ రాజన్( Pawandeep Rajan )ను ఉత్తరాఖండ్ కళలు, పర్యాటకం, సాంస్కృతికం బ్రాండ్ అంబాసిడర్‌గా బుధవారం నియమించారు. పవన్‌దీప్ తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ఇంగ్ ధామి ఈ ప్రకటన చేశారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చినా సంగీత ప్రపంచంలో తన నైపుణ్యంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతడు ఉత్తరాఖండ్‌కు మొత్తం దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టాడు అని సీఎం ధామి అన్నారు.
ఈ నెల 15న జరిగిన ఇండియన్ ఐడల్ షోలో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్.. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ ప్రాంతానికి చెందినవాడు. అద్భుతంగా పాడటంతోపాటు అన్ని సంగీత వాయిద్యాలనూ పవన్‌దీప్ వాయించగలడు. ఇదే అతన్ని ఇండియన్ ఐడల్‌లో ప్రత్యేకంగా నిలబెట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

