ఉత్తరాఖండ్ విషాదం: గల్లంతైన 38 మంది కోసం గాలింపు
Glacier burst: ఉత్తరాఖండ్ హిమపాతం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. మరికొందరు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హిమపాతం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. మరికొందరు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 38 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వారి ఆచూకీ కోసం ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం, ఇండియన్ ఆర్మీ జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హిమపాతం సంభవించిన సమయంలో ఘటనా ప్రాంతంలో మొత్తం 430 మంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, వారిలో 8 మంది మరణించారని, మరో 384 మందిని రక్షించగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. 430 మందిలో 392 మందిపోగా మరో 38 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వారి కోసం సెర్చింగ్ కొనసాగుతున్నదని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారత్-చైనా సరిహద్దుల్లోగల చమోలీ జిల్లాలోని కొండలపై శుక్రవారం సాయంత్రం భారీగా మంచు కురిసింది. ఆ మంచు ఒక్కసారిగా జారిపోయి ఓ కొండ దిగువన రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులపై పడింది. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో సుమ్నా గ్రామం సమీపంలో ఈ హిమపాతం సంభవించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

