రెండుసార్లు కరిస్తే.. కుక్కకు జీవితఖైదు.. యూపీ ప్రభుత్వం నిర్ణయం
శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష విధిస్తారు. అదే రెండుసార్లు కనుక కరిస్తే ఇక దాని జీవిత కాలమంతా జంతు కేంద్రంలోనే గడపాలి.
లక్నో, సెప్టెంబర్ 16 : శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష విధిస్తారు. అదే రెండుసార్లు కనుక కరిస్తే ఇక దాని జీవిత కాలమంతా జంతు కేంద్రంలోనే గడపాలి. ఇది ఒక విధంగా మనుషులకు విధించే జీవిత ఖైదు లాంటిది. అయితే దానిని దత్తత తీసుకోవడానికి అంగీకరించి, ఇక ముందు దానిని వీధిలోకి విడిచిపెట్టమంటూ ఎవరైనా అఫిడవిట్ ఇస్తే శిక్ష విధించకుండా వారికి అప్పగిస్తారు. వీధి కుక్కల ఆగడాల నివారణకు యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజత్ అన్ని పట్టణ, గ్రామీణ పౌర సంస్థలకు ఈ మేరకు ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు.
ఎవరైనా వ్యక్తి కుక్క కాటుకు గురై యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం వస్తే ఆ ఘటనను నమోదు చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని కరిచిన కుక్కను గుర్తించి మొదటి తప్పుగా 10 రోజుల శిక్ష విధిస్తారు. ఆ 10 రోజులు దాని ప్రవర్తనను గమనిస్తారు. తర్వాత దానికి మైక్రోచిప్ అమర్చి దాని కదలికలను నమోదు చేస్తారని ప్రయాగ్ రాజ్ వెటర్నరీ అధికారి బిజయ్ అమృత్ రాజ్ తెలిపారు. అదే కుక్క మరోసారి మనిషిని కరిస్తే ఇక దానికి జీవిత శిక్ష తప్పదని చెప్పారు. ఒక వేళ ఆ కుక్కను దత్తత తీసుకున్న వ్యక్తి దానిని వీధిలోకి విడిచిపెడితే ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

