లక్నో: ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడి చేసిన ఇద్దరు, దానిని వీడియో తీసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
హాపూర్‌లో ఈనెల 19న ఉదయం మూడు గంటలకు జునైద్ అనే వ్యక్తి ఇంటి నుంచి తన మనవడిని ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడని, అక్కడ అతడికి మరో ముగ్గురు కలిశారని, వారిలో ఇద్దరు బాలుడిపై లైంగిక దాడి చేయగా, మిగిలిన ఇద్దరూ దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేసినట్టు బాధితుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.