BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
BJP leader's son dies by suicide | బీజేపీ నేత కుమారుడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధించడంతో పాటు ఆస్తిని బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. సూసైడ్‌కు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు.
లక్నో: బీజేపీ నేత కుమారుడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధించడంతో పాటు ఆస్తిని బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. సూసైడ్‌కు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. (BJP leader’s son dies by suicide) బీజేపీ కాంకర్ఖేరా మండల ఉపాధ్యక్షుడు రాజీవ్ గుప్తా కుమారుడైన ప్రవల్ గుప్తాకు గత ఏడాది నవంబర్ నవంబర్ 2న స్నేహతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నది.
కాగా, తొలి వివాహ వార్షికోత్సవం ముందు ఘజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రవల్ గుప్తా ఆత్మహత్య చేసుకున్నాడు. నవంబర్ 1న మీరట్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో విషం సేవించి అపస్మారక స్థితిలో కనిపించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రవల్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు సూసైడ్‌కు ముందు ప్రవల్ గుప్తా ఒక వీడియో రికార్డ్ చేశాడు. భార్య స్నేహ, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులపై పలు ఆరోపణలు చేశాడు. తనను శారీరకంగా హింసించారని, మానసిక వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. భార్య తనకు మాడిన రొట్టె పెట్టేదని, తన ఆస్తిని ఆమె పేరు మీద రాయమని ఒత్తిడి చేయడంతో పాటు తన తల్లిదండ్రులు, సోదరిని కూడా అవమానించి తప్పుడు కేసులతో బెదిరించినట్లు ఆ వీడియోలో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ప్రవాల్ తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- blames wife
- burnt roti
- Dies
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

