న్యూఢిల్లీ, జూలై 8: కరోనా నుంచి కాపాడేందుకు 5 నుంచి 12 ఏండ్ల పిల్లలకు కార్బివాక్స్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇవ్వొచ్చని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సిఫారసు చేసింది. అయితే వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఈ వ్యాక్సిన్లను చేర్చుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.