Joe Biden | బైడెన్‌కూ డీప్‌ఫేక్ సెగ.. అమెరికా అధ్యక్షుడి గొంతుతో నకిలీ ఆడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా డీప్‌ఫేక్ సెగ తగిలింది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు.
Joe Biden | హైదరాబాద్, జనవరి 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా డీప్‌ఫేక్ సెగ తగిలింది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ‘ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్ద’ని బైడెన్ ఓటర్లను కోరినట్లు ఉన్న ఒక నకిలీ ఆడియో వైరలైంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా సృష్టించిన ఈ డీప్‌ఫేక్ కాల్స్‌పై వైట్‌హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్‌పై అభ్యంతరకరంగా రూపొందించిన డీప్‌ఫేక్ దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడం కలవరానికి గురిచేస్తున్నది.
డీప్ ఫేక్ ఎన్ని రకాలు?
ఫేస్ స్వాపింగ్: అసలు వీడియోలోని వ్యక్తి ముఖాన్ని కాకుండా మరో వ్యక్తి ముఖాన్ని చూపటం.
సింథటిక్ వాయిస్ : నకిలీ ఆడియోను సృష్టించడం.
టెక్స్ బేస్డ్ డీప్‌ఫేక్: చేతి రాతను ఏఐ టూల్స్‌తో విశ్లేషించి.. ఫేక్ను సృష్టించడం.
ఆబ్జెక్ట్ మ్యానిప్యులేటింగ్ : ఏదైనా వీడియోలో వ్యక్తులతో పాటు వారి చుట్టూ ఉన్న వస్తువుల్ని, ప్రదేశాలను మార్చడం.
హైబ్రిడ్ డీప్‌ఫేక్ : పైన చెప్పిన అన్ని డీప్‌ఫేక్ టెక్నిక్లను ఒకే వీడియోలో వినియోగించడం.
గుర్తించడమెలా?
వీడియో క్వాలిటీ, ఆడియో, టెక్స్లో కొన్ని లోపాలు, వ్యత్యాసాల్ని గమనించవచ్చు. అభ్యంతరకరంగా, ఫేక్‌గా కనిపించిన వీడియోలను ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తొలగిస్తున్నాయి. ఫార్వర్డెడ్ సందేశాలు నిజమైనవా? కాదా? అని విశ్లేషించుకొన్న తర్వాతే యూజర్లు స్పందిస్తే మంచిది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

