10% సుంకాలు చట్ట విరుద్ధం.. వాణిజ్య కోర్టులో ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన 10 శాతం సుంకాలను అమెరికా వాణిజ్య న్యాయస్థానం గురువారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ, మే 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన 10 శాతం సుంకాలను అమెరికా వాణిజ్య న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. 1970ల నాటి వాణిజ్య చట్టం ప్రకారం ఈ చర్యలు చట్టబద్ధంగా సమర్థనీయం కాదని కోర్టు తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులు కేవలం రెండు చిన్న వ్యాపారాలకు, వాషింగ్టన్ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తుంది.
అప్పీల్ ప్రక్రియ జరిగేంత వరకు ఇతర దిగుమతిదారులందరిపై సుంకాలు అమలులో ఉండేలా ఇది అనుమతిస్తుంది. ఫిబ్రవరి 24న ప్రవేశపెట్టిన 10 శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను సవాలు చేస్తూ బొమ్మల తయారీ సంస్థ బేసిక్ ఫన్, మసాలా దినుసుల దిగుమతిదారు బర్లాప్ అండ్ బారెల్, వాషింగ్టన్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం 2:1 తీర్పును వెలువరించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
వ్యాపార సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ఇది చాలా తొందరపాటు అవుతుందని పేర్కొంటూ ఒక న్యాయమూర్తి విభేదించారు. ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని 24 రాష్ర్టాల కూటమి కోరిన విస్తృతమైన ఇంజంక్షన్‌ను మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

