నైతిక మార్గంలోనే పయనం
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య నిబంధనావళి గురించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అత్యంత సరళంగా వివరించారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ పట్టె మంచం గురించి ప్రస్తావిస్తూ, మంచానికి నాలుగు కర్ర పట్టీలు ఉంటాయని, వాటిని కలుపుతూ నాలుగు దృఢమైన కోళ్లు ఉంటాయని చెప్పారు.
- న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య నిబంధనావళి గురించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అత్యంత సరళంగా వివరించారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ పట్టె మంచం గురించి ప్రస్తావిస్తూ, మంచానికి నాలుగు కర్ర పట్టీలు ఉంటాయని, వాటిని కలుపుతూ నాలుగు దృఢమైన కోళ్లు ఉంటాయని చెప్పారు. ఈ మంచానికి అవసరానికి తగినట్లు సాగే పట్టె ఉంటుందన్నారు. ఇవన్నీ కలిసి దృఢమైన, అవసరానికి తగినట్లు మారగలిగే స్థలం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై చర్చ జరిగిందన్నారు. అప్పట్లో భారత దేశం తన రాజ్యాంగ జీవితంలో 23 ఏళ్ల ప్రాయంలో ఉందని, తన వ్యవస్థలను నిర్వచించుకునే, ఆదర్శవాదం-అధికారం మధ్య బిగుతుగా ఉన్న తాడుపై నడవటం నేర్చుకుంటున్న దేశమని తెలిపారు. పార్లమెంటరీ మెజారిటీ, అది ఎంత భారీగా ఉన్నప్పటికీ, రాజ్యాంగ నైతిక డీఎన్ఏను పునర్లిఖించగలదా? అనే ప్రశ్న ఇమిడి ఉందన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో న్యాయ వ్యవస్థ స్వతంత్రత పరిమితులను కార్యనిర్వాహక శాఖ పరీక్షించడంపై చర్చను సీజేఐ ప్రస్తావించారు. కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రాజ్యాంగ పరిపక్వత, నైతికత మార్గాన్ని ఎంచుకుందన్నారు.
అత్యవసర కేసులు రెండు రోజుల్లో లిస్టింగ్
కేసుపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ముందు మౌఖికంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని, పరిశీలన పూర్తయిన కేసులు రెండు రోజుల్లో లిస్ట్ అవుతాయని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. కేసుల విచారణను క్రమబద్ధీకరిస్తూ సీజేఐ చర్యలు చేపట్టగా, శనివారం ఈ మేరకు సుప్రీం కోర్టు నుంచి ఒక సర్క్యులర్ విడుదలైంది’ అని సర్క్యులర్ పేర్కొన్నది. పాత కేసుల విషయంలో ఇప్పటికే విచారణ సాగుతున్న వాటిల్లో..వాయిదా కోరుతూ లేఖలను అనుమతించటం లేదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

