Puja Khedkar | పూజా ఖేద్కర్‌పై కేసు.. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు యూపీఎస్సీ చర్యలు
Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై (Puja Khedkar) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది. అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు, భవిష్యత్తు పరీక్షల నుంచి కూడా ఆమెను డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేద్కర్‌కు జారీ చేసింది.
కాగా, ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ దుష్ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణలపై వివరణాత్మక, సమగ్ర దర్యాప్తు నిర్వహించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, ఫొటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు వంటివి మోసపూరితంగా పొందినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. రాజ్యాంగ నిబద్ధత, ఉన్నతమైన విశ్వాసం, విశ్వసనీయతకు నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancel
- candidature
- files case
- fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

