లక్నో : పదేండ్ల కిందట తప్పిపోయిన భర్త కనిపించాడనుకుని ఆ మహిళ ఓ వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చింది. యూపీలోని బలియా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి ఎదుట జానకి దేవికి ఓ దివ్యాంగుడు కంటపడగా పదేండ్ల కిందట తప్పిపోయిన తన భర్త మోతీ చంద్ అనుకుని ఇంటికి తీసుకెళ్లింది.
ఆస్పత్రి ఎదుట గడ్డం పెంచుకుని మాసిన బట్టలతో కనిపించిన వ్యక్తిని మహిళ తన భర్త అని పొరబడింది. ఇన్నిరోజులు నీవు ఎక్కడున్నావు..ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా అతడు మౌనం దాల్చాడు. ఆపై ఆయన తన భర్త మోతీచంద్ అని భావించిన జానకి అతడిని ఇంటికి తీసుకువెళ్లింది.
భర్త ఒంటిపై పుట్టుమచ్చలు ఉండటంతో వాటిని గుర్తించేందుకు అతడి శరీరాన్ని పరిశీలించగా పుట్టుమచ్చలు లేకపోవడంతో అతడు జానకి భర్త కాదని వెల్లడైంది. ఆ వ్యక్తిని రాహుల్‌గా గుర్తించిన జానకి క్షమాపణ కోరింది. గ్రామస్తులు రాహుల్‌ను అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Read More :
US Presidential Election | అమెరికా అధ్యక్ష బరిలో మరో భారత సంతతి వ్యక్తి