Ram Temple inauguration | త్వరలో అయోధ్యకు హెలికాఫ్టర్ సేవలు షురూ..!
Ram Temple inauguration : మరో రెండు వారాల్లో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపధ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ram Temple inauguration : మరో రెండు వారాల్లో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపధ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుండటంతో ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో సందర్శకులు రానుండటంతో త్వరలో హెలికాఫ్టర్ సేవలను ప్రారంభిస్తామని యూపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు.
జనవరి 22లోగా హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమ శాఖ తరపున హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని, అయోధ్యలో ఎయిర్పోర్ట్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రామాలయ ప్రారంభ వేడుకకు అయోధ్యకు తరలివచ్చే భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అయోధ్యకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరగనుండటంతో రైల్వేల సామర్ధ్యం కూడా పెంచుతామని మంత్రి వెల్లడించారు.
జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈనెల 22న శ్రీరాముడి జన్మస్ధలమైన అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరామ విగ్రహం కొలువుతీరనుండటంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అతిపెద్ద చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఘట్టంగా ఆవిష్కృతం కానుంది.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్‌కు బానిసే.. అతనెవరంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

