Road Accident | కారును ఢీకొట్టిన కంటైనర్.. మహిళా మంత్రికి తప్పిన ప్రమాదం
ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబి రాణి మౌర్యకు (Baby Rani Mourya) పెను ప్రమాదం (Road Accident) తప్పింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబి రాణి మౌర్యకు (Baby Rani Mourya) పెను ప్రమాదం (Road Accident) తప్పింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. అయితే కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి గాయాలు లేకుండా ఆమె క్షేమంగా బయటపడ్డారు. హత్రాస్ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. గశుక్రవారం రాత్రి లక్నోకు పయణమయ్యారు. ఈ క్రమంలో ఫిరోజాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో రెండు వైపులా వాహనాలను ఒకే మార్గం గుండా దారిమళ్లించారు. దీంతో ఆమె కారు ముందు వెళ్తున్న కంటైనర్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. వాహనంపై డ్రైవర్ పట్టు కోల్పోవడంతో అది అదుపుతప్పి మంత్రి కారుపైకి దూసుకొచ్చింది.
అప్రమత్తమైన డ్రైవర్ కారు పక్కకు తీసుకెళ్లాడు. దీంతో కారు కుడివైపు స్వల్పంగా ధ్వంసమైంది. మంత్రికి ఎలాంటి ముప్పు వాటిళ్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ప్రెస్ వేపై వాహనాలు ప్రమాదాల బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ను పోలీసులు సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

