కాన్పూర్: గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే సందర్భంగా.. యూపీలోని గ్యాంగ్‌స్టర్(UP Gangster) అజయ్ థాకూర్.. బ్లాక్ కార్లతో స్టంట్ చేశాడు. 12 నలుపు రంగు కార్లతో అతను తన గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ కార్లకు బ్లాక్ ఫిల్మ్స్ వేసి, నెంబర్ ప్లేట్లు లేకుండా.. కాన్పూర్ సిటీలో హంగామా చేశాడు. అంతేకాదు సిటీలోని డీసీపీ ఆఫీసు వద్ద గట్టిగా హారన్లు కూడా మోగించాడు.
గ్యాంగ్‌స్టర్ అజయ్ థాకూర్‌పై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నల్లరంగు కార్ల వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. ఆదివారం రోజు తన గర్ల్‌ఫ్రెండ్‌ను కారులో ఎక్కించుకుని.. కాన్వాయ్‌ను తీసుకెళ్లాడు. ఆ కాన్వాయ్ కార్లను నిర్లక్ష్యంగా నడిపించారు. వాటితో స్టంట్స్ కూడా చేశారు. ఆ కార్లలో అక్రమ ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాన్వాయ్‌లో ఏ ఒక్క కారుకు కూడా నెంబర్ ప్లేట్ లేదు. రెండింటికి మాత్రం సైరన్లు ఉన్నాయి. ఓ కారుకు ఉన్న జెండా స్పష్టంగా లేదు. పాదాచారులకు ఇబ్బంది కలిగే రీతిలో కాన్వాయ్‌లోని వాహనాలు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అజయ్ థాకూరే కార్ల స్టంట్‌కు చెందిన వీడియోను ఆన్లైన్లో పోస్టు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మంగళవారం ఆ గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేశారు. అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
రిజిస్టర్ కాని వాహనాలతో స్టంట్ చేసినట్లు గుర్తించామని డీసీపీ ఆశిష్ శ్రీవాత్సవ తెలిపారు. ఆ కార్ల ఓనర్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. వాహనాల చట్టం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
A gangster celebrated his girlfriend’s birthday in style with a convoy of 12 cars. The vehicles, with black films and no number plates, paraded through the city, blaring sirens near the DCP South Office. #Kanpur #GangsterConvoy pic.twitter.com/TLYOBhU3Ro
— The Vocal News (@thevocalnews) January 7, 2025