Viral Video | గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన వధువు.. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులు
Viral Video | రివాల్వర్‌ను పైకి గురిపెట్టిన వధువు గాల్లోకి వరుసగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. అనంతరం రివాల్వర్‌ను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చింది. వధువు పక్కన ఉన్న వరుడు కొంత ఆందోళనతో అలాగే కూర్చొండిపోయాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
లక్నో: పెళ్లి సందర్భంగా వధువు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వధువు కోసం వెతుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి సేలంపూర్ గ్రామంలోని గెస్ట్ హౌస్‌లో ఒక జంటకు పెళ్లి జరిగింది. వివాహ తంతులో భాగంగా వధువరులు పూలదండలు మార్చుకున్నారు. అనంతరం పెళ్లి వేదికపై ఉన్న ఆసనంపై కూర్చొన్నారు. ఈ సందర్భంగా 23 ఏళ్ల వధువు రాగిణి కుటుంబానికి చెందిన ఒకరు ఆ స్టేజీ పైకి వచ్చి ఆమె చేతికి రివాల్వర్ ఇచ్చాడు. దీంతో పైకి గురిపెట్టిన ఆమె గాల్లోకి వరుసగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. అనంతరం రివాల్వర్‌ను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చింది. వధువు పక్కన ఉన్న వరుడు కొంత ఆందోళనతో అలాగే కూర్చొండిపోయాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పెళ్లి సందర్భంగా గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన వధువు, ఆ రివాల్వర్‌ను కలిగి ఉన్న ఆమె బంధువు గురించి పోలీసులు వెతుకుతున్నారు.
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో గన్‌తో కాల్పులు జరుపడం సర్వసాధారణం. ఇలాంటి సెలబ్రెటీ కాల్పులకు సంబంధించిన కొన్ని సంఘటనల్లో కొందరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆయుధ చట్టాన్ని సవరించింది. బహిరంగ సభలు, మతపరమైన కార్యక్రమాలు, వివాహలు, ఇతర ఫంక్షన్ల సమయంలో లైసెన్స్ ఉన్న గన్స్‌తో కాల్పులు జరుపడాన్ని కూడా నేరమైన చర్యగా పేర్కొంది. ఈ నేరానికి పాల్పడిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశముంది.
కాగా, ఇలాంటి కాల్పుల్లో ఎవరూ గాయపడకపోయినా, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసుల దృష్టికి వచ్చిన సంఘటనలపై కేసు నమోదు చేయాలని 2016లో లక్నో హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసుల దృష్టికి వచ్చిన ఇలాంటి వైరల్ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Bride fires in air during wedding in UP's Hathras, flees after case filed
(Video credit: Sumit Sharma) pic.twitter.com/fJ6S7WrAko
— TOIWestUP (@TOIWestUP) April 10, 2023
Also Read:
Dalai Lama | బాలుడికి ముద్దు పెట్టి తన నాలుకను చప్పరించమన్న దలైలామా.. వీడియో వైరల్, పలువురు విమర్శ
Baby Elephant Trunk | ‘నా తొండం ఇలా ఉందేమిటి?’.. ఓ ఏనుగు పిల్ల వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

