Baby Elephant Trunk | ‘నా తొండం ఇలా ఉందేమిటి?’.. ఓ ఏనుగు పిల్ల వీడియో వైరల్
Baby Elephant Trunk | ముఖానికి వేలాడుతున్న చిన్న తొండాన్ని (Baby Elephant Trunk) చూసుకుని ఏనుగు పిల్ల గందరగోళానికి గురవుతుంది. ‘నా తొండం ఇలా ఉందేమిటి?’ అని కొంత ఆశ్చర్యపోతుంది. తొండాన్ని నేలకు ఆనిస్తుంది. కాలితో దానిని తొక్కుతుంది.
న్యూఢిల్లీ: సాధారణంగా పిల్లలు చేసే చేష్టలు చూస్తే నవ్వొస్తుంది. ప్రత్యేకించి జంతువులతోపాటు వాటి పిల్లల చేష్టలు వింతగాను, నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. ఒక ఏనుగు పిల్ల (Baby Elephant) కూడా ఇలాగే ప్రవర్తించింది. దాని ముఖానికి వేలాడుతున్న చిన్న తొండాన్ని (Baby Elephant Trunk) చూసుకుని అది గందరగోళానికి గురవుతుంది. ‘నా తొండం ఇలా ఉందేమిటి?’ అని కొంత ఆశ్చర్యపోతుంది. తొండాన్ని నేలకు ఆనిస్తుంది. కాలితో దానిని తొక్కుతుంది. తొండాన్ని పైకి ఎత్తడంతోపాటు మెలి పెడుతుంది.
కాగా, ‘మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వీడియోలు’ అన్న పేరున్న యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్యూట్ ఏనుగు పిల్ల వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చూడచక్కని వీడియో అంటూ కొందరు కితాబు ఇచ్చారు. భూమిపైకి అడుగుపెట్టిన ఆ బుల్లి ఏనుగు పరిసరాలకు అలవాటు పడేందుకు, తన శరీరాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని కొందరు పేర్కొన్నారు.
మరోవైపు ఏనుగు పిల్ల ఒక ఏడాది వరకు తన తొండాన్ని నియంత్రించుకోవడాన్ని నేర్చుకోలేదని జంతుశాస్త్ర నిఫుణులు తెలిపారు. ఇక ఏనుగు తొండం అనేది దాని ముక్కు, పై పెదవి కలయిక భాగం. దీంతో నోటితోపాటు ముక్కుగాను తొండం పని చేస్తుంది. అంతేగాక పట్టుకోవడం, నీరు తాగడం, వాసన చూడటం, ప్రేమను వ్యక్తం వంటి అనేక పనులకు వాటి తొండం సహకరిస్తుంది. ఇలా అన్ని పనులకు సహాయపడే ఏనుగు తొండంలో సుమారు 40,000 కండరాలు ఉంటాయి. అలాగే సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారం, నీటి వాసనను ఏనుగులు తమ తొండంతో పసిగడతాయి.
https://twitter.com/moistonig/status/1643327683256877066?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1643327683256877066%7Ctwgr%5Ea93e779d874600b75e9a430fc5fa8db0facc27b7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-newborn-baby-elephant-confused-about-trunk-haathi-ka-video-5987782%2F
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

