Nirmala Sitharaman | దేవుడిని నమ్మితేనే ఒత్తిడిని జయించొచ్చు.. యువ సీఏ మృతిపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్(26) అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
- యువ సీఏ మృతిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
- ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టిన నేతలు, నెటిజన్లు
Nirmala Sitharaman | చెన్నై: పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్(26) అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పని ఒత్తిడి గురించి మాట్లాడకుండా, దేవుడి కృపతోనే ఒత్తిడిని జయించవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ‘మన పిల్లలు విద్య కోసం కళాశాలలు, యునివర్సిటీలకు వెళ్లి అద్భుతంగా బయటకు వస్తారు.
సీఏ చదివి ఓ సంస్థలో పని చేస్తున్న మహిళ పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్టు రెండుమూడు రోజుల క్రితం మాకు వార్త వచ్చింది. మీరు ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా ఒత్తిడిని తట్టుకునే మనోబలం ఉండాలి. దైవత్వంతోనే దీనిని సాధించవచ్చు. దేవుడిపై విశ్వాసాన్ని ఉంచండి. దీని ద్వారా మీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగేతే మనోబలం సాధించవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ‘విద్యాసంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు మనోబలం వస్తుంది. ఇదే వారి పురోగతికి, దేశ పురోగతికి ఉపయోగపడుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ‘కఠినమైన సీఏ డిగ్రీని చదవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే మనోబలం అన్నాకు ఉంది. ఆమె ప్రాణాలు తీసిన విషపూరితమైన పని సంస్కృతి, అధిక పని గంటల గురించి మాట్లాడాలి. బాధితురాలిని నిందించడం ఆపండి’ అంటూ నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల రోజూవారీ కష్టాలను నిర్మల అవమానిస్తున్నారని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ విమర్శించారు. అన్నా మరణానికి కారణమైన సమస్యలపై మాట్లాడకుండా దేవుడిని నమ్ముకోండని సలహా ఇవ్వడం వింతగా ఉందని, ఇది కఠినమైనదని పేర్కొన్నారు. నెటిజన్లు సైతం నిర్మల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.
బాధితురాలిని నిందించలేదు: నిర్మల
తన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. బాధితురాలిని నిందించడం తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఎవరి పేర్లూ తీసుకోలేదు. నేను మాట్లాడిన యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల మనోబలం పెంచుకోవడానికి ఇది ఎంత అవసరమనే దాని గురించే నేను మాట్లాడాను’ అంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

