CAA | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
CAA | లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
CAA | లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం నియమ నిబంధనలను కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫై చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్లోనే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకొన్నది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది.
తాజాగా ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ మేరకు నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు సైతం ఎన్నికలకు ముందే సీసీఏను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పుడు సీఏఏ అమల్లోకి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

