Bridge Collapses | బీహార్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. రెండు వారాల్లో రెండో సంఘటన
Bridge Collapses | బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది.
పాట్నా: బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తున్నదని అన్నారు. కిషన్‌గంజ్, కలిహార్‌ను అనుసంధానం చేసే ఈ వంతెనను మెచ్చి నదిపై నిర్మిస్తున్నట్లు చెప్పారు.
కాగా, జూన్ 4న బీహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఖగారియా జిల్లాను భాగల్పూర్తో అనుసంధానించే ఆ వంతెన పేకముక్కలా పడిపోయింది. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు మరణించాడు. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఆ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై బీహార్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తైన, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలకు ‘స్ట్రక్చరల్ ఆడిట్’ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

