Accident | టీ స్టాల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం
Accident | ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు టీ స్టాల్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు టీ స్టాల్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను రక్షించి, దవాఖానకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మదాబాద్ కొత్వాలీ పరిధిలోని అహిరోలి శివారులోని ఓ టీస్టాల్ వద్ద జనం కూర్చున్నారు. ఉదయం సమయంలో భరౌలీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపు తప్పి టీ స్టాల్లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.
ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు. ఆ తర్వాత గ్రామస్తులు మృతదేహాలను రోడ్డుపైనే ఉంచి.. ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను శాంతింపజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

