ఏటా రెండుసార్లు అడ్మిషన్లు
విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్నట్టుగా భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునే కొత్త విధానం అమలులోకి రానున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చీఫ్ జగదీశ్ కుమార్ వెల్లడించారు.
- జూలై- ఆగస్టు, జనవరి- ఫిబ్రవరి మధ్య ప్రవేశాలు
- వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కొత్త విధానం
- 2024-25 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వెల్లడించిన యూజీసీ చీఫ్ జగదీశ్కుమార్
న్యూఢిల్లీ, జూన్ 11: విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్నట్టుగా భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునే కొత్త విధానం అమలులోకి రానున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చీఫ్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని, ప్రతియేటా జూలై – ఆగస్టులో, జనవరి – ఫిబ్రవరిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఆయన పీటీఐకి తెలిపారు. ఈ విధానం చాలామంది విద్యార్థులకు మేలు చేస్తుందని అన్నారు. ఫలితాల వెల్లడిలో ఆలస్యం, ఆరోగ్య, వ్యక్తిగత కారణాల వల్ల జూలై – ఆగస్టులో అడ్మిషన్ పొందలేని వారు జనవరి – ఫిబ్రవరిలో పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకసారి అడ్మిషన్ పొందలేకపోయిన విద్యార్థులు మళ్లీ అడ్మిషన్ కోసం ఏడాది పాటు ఎదురుచూస్తూ కాలం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే పరిశ్రమలు కూడా ఏటా రెండుసార్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయవచ్చని వివరించారు.
తప్పనిసరి ఏమీ కాదు
ఇప్పటికే అంతర్జాతీయ ఉన్నత విద్యాసంస్థలు ఈ బైఆన్యువల్ అడ్మిషన్ విధానాన్ని పాటిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు భారతీయ ఉన్నత విద్యా సంస్థలు కూడా ఈ విధానాన్ని పాటిస్తే విద్యాసంస్థల మధ్య అంతర్జాతీయ సహకారం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తద్వారా ప్రపంచ స్థాయితో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుందని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు తగ్గట్టుగా మన విద్యా ప్రమాణాలు ఉంటాయని అన్నారు. అయితే, అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదని జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలకు ఉన్న మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, ఇతర వనరులను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. కాగా, ప్రస్తుతం మన దేశంలో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు జూలై – ఆగస్టులో అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. గత ఏడాది ఓపెన్, దూర విద్య, ఆన్లైన్ కోర్సులకు ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు చేపట్టేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం గత ఏడాది సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడిందని జగదీశ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

