న్యూఢిల్లీ, , సెస్టెంబర్ 2: డిగ్రీ సర్టిఫికెట్స్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్‌పై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించరాదని పేర్కొంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలకు శనివారం ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఉద్యోగ నియామకాలు, వివిధ కోర్సుల సమయంలో వెరిఫికేషన్‌ను సులభతరం చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, డిగ్రీ సర్టిఫికెట్స్‌పై ఆధార్ నంబర్‌ను ముద్రించాలని నిర్ణయించినట్టు యూజీసీకి సమాచారం అందడంతో ఉత్తర్వులు జారీచేసింది.