న్యూఢిల్లీ, జనవరి 30: వివాదాస్పద డి-రిజర్వేషన్‌పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన రిజర్వ్డ్ కేటగిరీలలో అభ్యర్థులు దొరక్కపోతే ఆ స్థానాన్ని అన్ రిజర్వ్డ్ క్యాటగిరీగా ప్రకటించవచ్చని యూజీసీ గత ఆదివారం విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేయడానికే ఈ ప్రతిపాదన తెచ్చారంటూ కాంగ్రెస్ మండిపడింది.