Uddhav Thackeray: ఉద్ధవ్‌కు దక్కని ఊరట.. షిండేనే సీఎం: సుప్రీంకోర్టు
Uddhav Thackeray: శివసేన సంక్షోభంపై ఇవాళ సుప్రీం తీర్పునిచ్చింది. మహారాష్ట్ర సీఎంగా షిండేనే కొనసాగుతారని కోర్టు తేల్చింది. కానీ ఉద్దవ్ థాక్రేకు మెజారిటీ లేదని గవర్నర్ చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. థాక్రే రాజీనామా చేయడం వల్ల ఆయన్ను తిరిగి నియమించలేమని కోర్టు చెప్పింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. పార్టీకి థాక్రే రాజీనామా చేశారని, అందుకే ఆయన్ను తిరిగి ప్రభుత్వానికి నియమించలేని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో బలపరీక్షకు హాజరుకాకుండానే థాక్రే తన పదవికి రాజీనామా చేశారని కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేనే సీఎంగా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో శివసేన పార్టీలో చెలరేగిన కుమ్ములాటకు సుప్రీం తాజా తీర్పుతో థాక్రే వర్గానికి జలక్ ఇచ్చింది.
గత ఏడాది జూన్‌లో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మెజారిటీని థాక్రే కోల్పోయారని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉద్ధవ్ తరపు సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మనూ సింఘ్వీలు వాదించారు. షిండే వర్గం తరపున హరీశ్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జఠ్మలానీలు వాదించారు.
శివసేన పార్టీ, గుర్తు విషయంలో ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీకి ధనస్సు సింబల్‌ను కేటాయించారు. ఇక థాక్రే వర్గానికి శివసేన ఉద్దవ్ థాక్రే పేరుతో పాటు టార్చ్ సింబల్‌ను కేటాయించారు. ప్రస్తుతం శివసేన పార్టీలో ఉన్న సంక్షోభ కేసును విస్తృత ధర్మాసనానికి సుప్రీం బెంచ్ రిఫర్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

