అలైన్మెంట్ మార్చండి

ముంబై-హైదరాబాద్ హెచ్ఎస్సార్పై ప్రధానికి ఉద్ధవ్ లేఖ
ముంబై, సెప్టెంబర్ 28: ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ (హెచ్ఎస్సార్) కారిడార్ అలైన్‌మెంట్‌ను జాల్నా-నాందేడ్ మార్గం మీదుగా వెళ్లేలా మార్చాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఠాక్రే లేఖ రాశారు. ముంబై-నాగ్‌పూర్ హెచ్ఎస్సార్ను ‘సమృద్ధి మహామార్గ్’ పరిధిలో చేపట్టేందుకు సహకరిస్తామని తెలిపారు. సమృద్ధి మహామార్గ్… ముంబై, నాగ్‌పూర్‌లను అనుసంధానం చేసే సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే. ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాందేడ్-జాల్నా మధ్య ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రణాళిక రచిస్తున్నది. ముంబై-నాగ్‌పూర్ హెచ్ఎస్సార్ జాల్నా వరకు సమృద్ధి మహామార్గ్ పరిధిలో ఉంటుంది. కాబట్టి దానిని హైదరాబాద్ వరకు పొడిగించవచ్చు’ అని ఠాక్రే పేర్కొన్నారు. కాగా ముంబై-హైదరాబాద్ హెచ్ఎస్సార్ కారిడార్ పూర్తయితే ఇరు నగరాల మధ్య ప్రయాణకాలం ప్రస్తుతమున్న 14 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

