Kavita Chaudhary | గుండెపోటుతో నటి కన్నుమూత
Kavita Chaudhary : 1989 సూపర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటి కవితా చౌధరి మరణించారు.
Kavita Chaudhary : 1989 సూపర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటి కవితా చౌధరి (67) మరణించారు. అమృత్‌సర్‌లోని పార్వతిదేవి ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు సుచిత్ర వర్మ వెల్లడించారు.
నటి కవితా చౌధరి కొన్నేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత ఏడాది తాము కలిసిన సందర్భంలో కవిత తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని, తన కీమోథెరఫీ గురించి కూడా ఆమె తెలిపారని సుచిత్ర వర్మ చెప్పారు. కవితను కోల్పోవడం బాధాకరమని, ఇక ఆమెను కలిసే అవకాశం లేకపోవడం తనను తీవ్రంగా కలిచివేస్తోందని అన్నారు.
హఠాత్తుగా ఆమె ఆరోగ్యం ఇంతలా క్షీణిస్తుందని తాను ఊహించలేదని అన్నారు. డీడీలో ఉడాన్ సిరీస్ ముఖ్య నటిగా, ఐకానిక్ సర్ఫ్ కమర్షియల్ యాడ్స్‌లో మెరిసిన కవితా చౌధరి ఎంతో పేరుతెచ్చుకున్నారని, తనకు మాత్రం ఆమెతో అనుబంధం అధికమని సుచిత్ర వర్మ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు.
Read More :
CM Revanth | సీఎం రేవంత్ సభకు గురుకుల విద్యార్థులు..! ఎర్రటి ఎండలో తీవ్ర ఇబ్బందులు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

