Encounter | కుల్గామ్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter | జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Encounter : జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులను గమనించిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం ప్రారంభించారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు, సైన్యం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని కుల్గామ్ అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా గుర్తించారు.
గాయపడ్డ వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు భారీ బలగాలు మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత పదేళ్లకు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

