Encounter | బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఘటనా ప్రాంతంలో భద్రతాసిబ్బంది ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తాజాగా మరణించిన ఇద్దరితో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 118కి చేరింది. మే 23న నారాయణ్‌పూర్-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మే 10న బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్-కాంకేర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మృతిచెందారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

