జమ్ములో కనిపించిన మరో రెండు డ్రోన్లు.. హైఅలెర్ట్‌లో ఆర్మీ స్టేషన్లు

జమ్ము: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ డ్రోన్ ఆర్మీ బేస్‌పై ఎగురుతూ కనిపించగా.. మరొకటి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో కనిపించింది. వెంటనే అలెర్ట్ అయిన ఆర్మీ జవాన్లు వాటిపై ఫైరింగ్ జరిపారు. జమ్ము పఠాన్‌కోట్ నేషనల్ హైవేపై కాలుచాక్-పూర్మాండల్ ప్రాంతంలో రెండు క్వాడ్‌కాప్టర్స్ కనిపించాయి. కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌కు దగ్గరగా ఎగురుతూ కనిపించాయి అని పోలీసులు వెల్లడించారు.
ఆర్మీ జవాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే చీకట్లో ఆ రెండు డ్రోన్లు తప్పించుకుని వెళ్లిపోయాయి. వాటిని కనిపెట్టడానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జమ్ము ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై తొలిసారి డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే ఇలా మరో రెండు డ్రోన్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్లతో దాడి చేయడం అనేది ఇదే తొలిసారి. ఆదివారం తెల్లవారుఝామున రెండు పేలుళ్లు జరిగాయి. ఈ ఉగ్రదాడిపై జమ్ముకశ్మీర్ పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

