Bihar MLAs | బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీలకు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
Bihar MLAs | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన INDIA కూటమికి లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరుతున్నారు. తాజాగా బీహార్లో కూడా INDIA కూటమికి షాక్ తగిలింది.
Bihar MLAs: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన INDIA కూటమికి లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరుతున్నారు. తాజాగా బీహార్లో కూడా INDIA కూటమికి షాక్ తగిలింది. అక్కడ ఆ కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందే తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకు వారు రాజీనామాలు చేశారు.
బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మురారి ప్రసాద్ గౌతమ్, సిద్ధార్థ్ సౌరవ్.. ఆర్జేడీకి చెందిన సంగీత కుమారి ఉన్నారు. మురారీ ప్రసాద్ గౌతమ్ చెనారి స్థానం నుంచి బీహార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సిద్ధార్థ్ సౌరవ్ విక్రమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ఆర్జేడీకి చెందని సంగీతా దేవి కుమారి మొహానియా అసెంబ్లీ స్థానం నుంచి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌధరి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

